రాష్ట్రస్థాయి జూడో పోటీలలో ఆక్స్ఫర్డ్ విద్యార్థికి కాంస్య పథకం
నగరంలోని ఎల్లమ్మ గుట్ట లో గల ఆక్స్ఫర్డ్ హై స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని సుదీక్ష ఇటీవల కరీంనగర్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి జూడో పోటీలలో పాల్గొన్నట్లు పాఠశాల కరస్పాండెంట్ మామిడాల మోహన్ శనివారం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 మంది విద్యార్థులు ఈ జూడో పోటీలలో పాల్గొనగా నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆక్స్ఫర్డ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని సిహెచ్ సుదీక్ష కాంస్య పతకాన్ని సాధించి రాష్ట్రస్థాయిలో ఆక్స్ఫర్డ్ పాఠశాల కు పేరు తీసుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని సుదీక్ష ను పాఠశాల యాజమాన్యం కరస్పాండెంట్ మామిడాల మోహన్ ప్రిన్సిపాల్ సుధారాణి ఇన్చార్జి గంగాధర్ హైస్కూల్ ఇన్చార్జి శ్రీశైలం పిడి రంజిత్ ఆధ్వర్యంలో మెమొంటో శాలువాతో పుష్పగుచ్ఛాలు అందజేసి సన్మానించారు
No comments:
Post a Comment