Monday, November 18, 2019

సక్షమ్ ఇందూర్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక



దివ్యాంగుల అభివృద్ధి కొరకు పని చేస్తున్న అఖిల భారతీయ సంస్థ సక్షమ్ ఇందూరు జిల్లా నూతన కార్యవర్గాన్ని  రాష్ట్ర కార్యదర్శి శ్రీ నందనం కరుణాకర్ ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆదివారం జిల్లా కేంద్రం లోని  ప్రగతి నగర్ మాధవ స్మారక సమితి లో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షులుగా సందీప్ దేశ్ ముఖ్, కార్యదర్శిగా క్యాతం గణేష్, సహ కార్యదర్శి  శ్రీమతి సుజాత, కోశాధికారి పోల్కం శ్రీనివాస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల అభివృద్ధి కొరకు వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ, వారి కలలను సాకారం చేసేందుకు జూన్ 20 2008 సంవత్సరంలో మహారాష్ట్రలోని నాగపూర్ లో సక్షమ్ అంకురార్పణ జరిగిందన్నారు.క్రమక్రమంగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించబడి దివ్యాంగులు మిగతా వారిలాగా సమాన గౌరవం పొందేందుకు అహర్నిశలు పనిచేస్తుందని పేర్కొన్నారు.సక్షమ్ యొక్క కార్యక్రమాలను ఇందూరు జిల్లా దివ్యాంగుల వరకు చేర్చేందుకు జిల్లా కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. నూతన కార్యవర్గాన్ని ప్రత్యేకంగా అభినందించి వారికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో సక్షమ్ రాష్ట్ర కోశాధికారి వి. నీలోత్పల శర్మ, రంగారెడ్డి జిల్లా కోశాధికారి బి.వి.ఆర్ శాస్త్రి, ఇందూరు నగర కార్యవాహ గంగా నరసయ్య, నాగర్ కర్నూల్ కోఆర్డినేటర్ ఆంజనేయులు, గోపాల్, ఇతిహాస సంకలన సమితి కో ఆర్డినేటర్ కందకుర్తి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.


https://www.youtube.com/watch?v=mD_v4htrI6c


No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...