Thursday, November 14, 2019

డయాబెటిక్ అవగాహన ర్యాలీ


ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా నిజామాబాదు నగరంలో గురువారం ఉదయం లయన్స్ క్లబ్ ల ఆద్వర్యంలో డయాబెటిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాలిటెక్నిక్ మైదానం వద్ద ర్యాలీని నిజామాబాద్ ఏసిపి జి.శ్రీనివాస్ కుమార్  జెండా ఊపి ప్రారంబించారు.ప్రజలకు షుగర్ వ్యాది పట్ల అవగాహన కోసం ర్యాలీ నిర్వహించడం అభినందనీయమని ఏసిపి ఈ సందర్భంగా అన్నారు.మధుమేహ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.మధుమేహం నివారణ కోసం యోగా వ్యాయామం,వాకింగ్ చేయాలని ఆయన సూచించారు.కార్ ర్యాలీ నిజామాబాదు నగరంలోని  కంఠేశ్వర్ ,రైల్వేస్టేషన్,బస్టాండ్,గాంధీ చౌక్, రాజరాజేంద్ర చౌరస్తా,పూలాంగ్  మీదుగా వినాయక్ నగర్ వరకు కొనసాగింది.లయన్స్ జిల్లా గవర్నర్ ఇరుకుల వీరేశం,కార్యదర్శి డి.యాదగిరి, పీఅర్వో పి.లక్ష్మినారాయణ,
అదనపు జిల్లా కార్యదర్శి కరిపె రవీందర్,
డాన్ టు డస్క్ కార్యక్రమ టార్చ్ బేరర్  జీఎస్టీ కో-ఆర్డినేటర్ గందాని శ్రీనివాస్, రీజియన్ చైర్మెన్ గోపాల్ దాస్ అగర్వాల్,జోన్ చైర్మెన్ ద్వారకాదాస్ అగర్వాల్, ఆయా క్లబ్ ల అధ్యక్షులు లక్ష్మినారాయణ భరద్వాజ్,ఉండవల్లి శివాజి,శెనిశెట్టి కిషన్,సత్యనారాయణ గౌడ్,రాఘవులు,ఉషా అగర్వాల్,పద్మ తదితరులు పాల్గొన్నారు


https://www.youtube.com/watch?v=eV4YuAcbsxA


No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...