Friday, December 13, 2019

పేదలు, రైతులకు అవసరమైన రుణాలు అందిస్తేనే అభివృద్ధి - మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి


పేదలు, రైతులకు అవసరమైన రుణాలు అందిస్తేనే అభివృద్ధి - మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి


నిజామాబాద్ డిసెంబర్ 13 పేదలు రైతులను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే దేశం, బ్యాంకులు అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర రహదారులు- భవనములు, శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. 


శుక్రవారం నాడు ఆయన జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జిల్లా లీడ్ బ్యాంకు ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ కొన్ని బ్యాంకులు వాటి శాఖలు రైతులకు, స్వయం ఉపాధి పథకాలకు రుణాలు అందించడంలో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో బ్యాంకులను జాతీయం చేశారనే  విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రబీలో కేవలం 23%  మాత్రమే రుణాలు మంజూరు చేశారని ముఖ్యంగా యూబిఐ, యూకో ఇతర బ్యాంకులు మరీ అధ్వానంగా రెండు శాతం, నాలుగు శాతం రుణాలు మంజూరు చేశారన్నారు.  అవసరమైనవారికి ముఖ్యంగా పేదలకు రుణాలు అందించడం బ్యాంకుల సామాజిక బాధ్యతగా భావించాలని తెలిపారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 92 శాతం రుణాలు అందించడంపై అభినందించారు. వర్షాలు సమృద్ధిగా పడి చెరువులు, ప్రాజెక్టులు నిండినందున ఈ యాసంగి లో రెండున్నర లక్షల పైగా ఎకరాలలో  వరి పంట, మరో రెండున్నర లక్షల ఎకరాలలో ఇతర పంటలు సాగు చేసే అవకాశం ఉన్నందున బ్యాంకులు కూడా సంతృప్తికరంగా రుణాలు అందిస్తారని ఆశిస్తున్నాను అన్నారు.  బ్యాంకర్లకు కూడా సర్వీస్ ఏరియాని బట్టి లక్షణాలు నిర్దేశించాలి అన్నారు అన్ని బ్యాంకులు కూడా లక్ష్యాలకు అనుగుణంగా రుణాలు అందించేలా లీడ్ బ్యాంకు చర్యలు తీసుకోవాలని ఒక బ్యాంకు రుణాలు ఇవ్వకుంటే దాన్ని చూసి ఇతర బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడానికి ముందుకు రారని తెలిపారు. ఈ సమీక్ష తర్వాత కూడా రుణాల మంజూరులో తాత్సారం చేస్తే వారి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వెళ్లడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.


స్వయం ఉపాధి పథకాల కింద ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీలకు ప్రభుత్వం మంజూరు కనుగుణంగా రుణాలు మంజూరు చేసి ప్రతి యూనిట్ కూడా గ్రౌండ్ జరిగేలా బ్యాంకులు సహకరించాలన్నారు. కొన్ని బ్యాంకు శాఖలు మంజూరు చేసిన లోన్ మొత్తాన్ని డిపాజిట్ చేసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. డిసెంబర్ చివరి కల్లా మంజూరు అనుగుణంగా అన్ని గ్రౌండింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను బ్యాంకర్లను ఆదేశించారు. బ్యాంకులు బలంగా ఉండాలంటే ఉత్పత్తులతో కూడిన పనులకు రుణాలు అందిస్తామని రుణాలు పొందిన వారు ఆర్థికంగా బలపడతారని తద్వారా బ్యాంకులు కూడా లాభాల బాటలో నడుస్తాయని ఆ విధంగా దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా ఫసల్ బీమా యోజన కింద అర్హులు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవడానికి చర్యలు తీసుకోవాలన్నారు.


DLRC కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఎం ఆర్ ఎం రావు మాట్లాడుతూ SC ST BC minority కార్పొరేషన్ల ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడంలో అనుకున్న మేర గ్రౌండింగ్ జరగడంలేదని, కొన్ని బ్యాంకు శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సరిగా స్పందించడం లేదన్నారు. వ్యవసాయ  టర్మ్ లోన్లు   కూడా తక్కువగానే ఇచ్చారన్నారు.


ఈ సమావేశంలో  జిల్లా పరిషత్ చైర్మన్ డి. విట్టల్ రావు మాట్లాడుతూ గ్రామం  యూనిట్ గా కాకుండా రైతులు వేసిన వ్యక్తిగత పంటలను యూనిట్గా తీసుకుంటే పంట నష్టపోయిన ప్రతి పంటకు నష్టపరిహారం లభిస్తుందన్నారు. ఎమ్మెల్సీ బిజీ గౌడ్ మాట్లాడుతూ రుణ ప్రణాళిక వర్షాల సీజన్ కంటే ముందు చేసేదని పంటల సాగును దృష్టిలో పెట్టుకొని రుణ లక్ష్యాలు పెంచాలన్నారు.


ఈ సమీక్ష సమావేశంలో  ఎల్ డి ఎం జయ సంతోషి, ఎమ్మెల్సీ ఆకుల లలిత బ్యాంకర్లు పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు



No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...