Wednesday, January 8, 2020

జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి - తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షులు కుంచం శ్రీనివాస్

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న సార్వత్రిక సమ్మె సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా స్థానిక అసిస్టెంట్ లేబర్ కమిషనర్  యోహన్  కు   తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) బుధవారం వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కుంచం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పానుగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ  ప్రభుత్వాల విధానాలు, పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలోనూ, ప్రజల
సమనస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలోనూ జర్నలిస్టులు సంధానకర్తలుగా కీలక భూమిక
పోషిస్తున్నారు. నిత్యం సమాజ హితం కోసం గళాలను విప్పే..కలాలతో ప్రశ్నించే జర్నలిస్టులపై
దేశంలో రోజురోజుకీ దాడులు పెరిగిపోతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఉద్యోగ భద్రత లేక అరకొర
వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. ఇంకోవైపు వర్కింగ్ జర్నలిస్టులకు అండగా నిలిచే
కార్మిక చట్టాల నిర్వీర్యానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందని ఆరోపించారు. ఈ చర్యలన్నీ జర్నలిస్టుల ఉనికికే
ప్రమాదం తెచ్చే దుస్థితి నేడు నెలకొందని, ఈ నేపథ్యంలోనే వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను నిర్వీర్యం
చేయొద్దనీ, జర్నలిస్టుల హక్కులను పరిరక్షించాలని కోరారు. ప్రతి ఒక్క జర్నలిస్టుకూ జస్టిస్
మజితియా కమిషన్ సూచనల ప్రకారం వెజ్ బోర్డ్ అమలు చేయాలన్నారు. పెన్షన్ సౌకర్యాన్ని
కల్పించాలని, జర్నలిస్టులందరికీ జీవన భద్రతను కల్పించాలని విన్న వించారు. వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలను రద్దు చేయొద్ధని,44 కార్మిక చట్టాలను 4 కోడ్లు విభజించొద్దని, జస్టీస్ మజితియా వేజ్బోర్డు సీఫారసులను అమలు చేయాలని, జర్నలిస్టులందరికీ పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని, జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో 
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా అధ్యక్షులు కుంచం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి పానుగంటి శ్రీనివాస్ తో పాటు జిల్లా సభ్యులు నర్సింహ రెడ్డి, రాంచందర్ రెడ్డి, కోరి రాకేష్, మధు, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...