Thursday, October 15, 2020

రానా కూడా సెట్లో అడుగు పెట్టబోతున్నాడు

 



టాలీవుడ్ లో ఆరు ఏడు నెలల తర్వాత షూటింగ్ సందడి కనపడుతోంది. గత నెలలో కొన్ని సినిమాలు ప్రారంభం అవ్వగా ఈ నెలలో మరిన్ని సినిమా షూటింగ్స్ షురూ అయ్యాయి. మిగిలి ఉన్న సినిమాల షూటింగ్స్ వచ్చే నెల ఆరంభం నుండి ప్రారంభం అవ్వబోతున్నాయి. యంగ్ హీరో రానా నటిస్తున్న విరాటపర్వం సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ అంచనాల నడుమ వేణు ఉడుగుల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా గత ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా అనేక కారణాల వల్ల సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. కరోనా కారణంగా ఏడు నెలలు గా షూటింగ్ జరగలేదు. ఈ సినిమాలో రానా లుక్.. సాయి పల్లవి లుక్ తో పాటు కీలక పాత్రలో నటిస్తున్న ప్రియమణి లుక్ కూడా రివీల్ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. సినిమాపై ఇప్పటికే అంచనాలు పెంచేశారు. 1990 కాలం నాటి నక్సలైట్ ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. రానా ఈ సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడా నక్సలైట్ గా కనిపించబోతున్నాడా అనే విషయంలో సస్పెన్స్ ఉంది. దాదాపు అన్ని సినిమాలు పట్టాలెక్కిన నేపథ్యంలో ఈ సినిమాను కూడా ప్రారంభించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు.

 

వికారాబాద్ ఫారెస్ట్ లో నవంబర్ 1 నుండి దాదాపు మూడు వారాల పాటు చిత్రీకరణ చేయబోతున్నారట. దాంతో సినిమా దాదాపుగా పూర్తి అవుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ షెడ్యూల్ లో రానా.. సాయి పల్లవి.. ప్రియమణితో పాటు కీలక నటీనటులు పాల్గొనబోతున్నారు. ఈ సినిమా అంతా సవ్యంగా ఉంటే జనవరి లేదా ఫిబ్రవరిలో లేదంటే సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ కోసం రానా చాలా కాలం తర్వాత కెమెరా ముందుకు రాబోతున్నాడు. పెళ్లి తర్వాత రానా చేస్తున్న సినిమా ఇదే.



No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...