Sunday, October 18, 2020

రైతులను లాభాల బాటలోకి తేప్పించాలి -  స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి


ఉమ్మడి జిల్లా రైతులను లాభాల బాటలో తెప్పించేందుకు డిసిసిబి బ్యాంకు ద్వారా కృషి చేయాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు . ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన డిసిసిబి బ్యాంకు అంతస్తులో
చైర్మన్ చాంబర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకుకు రాష్ట్రంలోనే ఎంతో గొప్ప చరిత్ర ఉందని ఆ చరిత్రను నిలుపుకోవాలన్న బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాష్ట్రంలో సహకార బ్యాంకుల పనితీరు బాగుందని రైతులకు ఉపయోగపడే విధంగా ఎన్నో మార్పులు జరుగుతున్నాయన్నారు. రైతులకు అతి సమీపంగా సేవలందించేవి  సహకార బ్యాంకులు అని వీటివల్ల రైతులు రుణాలు పొందడమే కాకుండా విత్తనాలు, ఎరువులు, దాన్యం కొనుగోలు లాంటి కార్యక్రమాలను సహకార సంఘాల సహకారంతో నిర్వహిస్తున్నా యన్నారు. తాను ఉమ్మడి జిల్లా డిసిసిబి బ్యాంకు అధ్యక్షుడిగా పని చేశానని ఆయన గుర్తు చేశారు. ఎంతోమంది ఇప్పటివరకు డీసీసీబి అధ్యక్షులు జిల్లాలో సహకార బ్యాంకు అభివృద్ధి కోసం కృషి చేశారని, పటిష్టమైన పునాది వేశారని, దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత కొన్నేళ్లుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి విజయవంతంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న చరిత్ర నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంకుకు ఉందని ఆయన అన్నారు. రైతు లాభం పొందాలనేది సీఎం కేసీఆర్ ఉద్దేశమని, అందుకు అనుగుణంగా సహకార సంఘాలు, సహకార బ్యాంకులు మీ పరిధిలో ఉన్న రైతులు రుణం తీసుకుని తిరిగి వాటిని డిపాజిట్ చేసే స్థాయికి ఎదగాలన్నది తమ ధ్యేయంగా పని చేయాలన్నారు. రైతులకు అప్పు ఇవ్వడమే ముఖ్యం కాదని రైతులకు అప్పు అవసరం లేకుండా వాళ్లు అభివృద్ధి చెందేలా సహకార బ్యాంకులు, సహకార సంఘాలు పని చేయాలన్నారు. 


ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు కొండూరు రవీందర్ రావు, ఎమ్మెల్యేలు బాజీరెడ్డి గోవర్ధన్,  హన్మంతు షిండే, నల్లమడుగు సురేందర్, ఏం.యల్ సి వి జీ గౌడ్, జెడ్పీ చైర్మన్ ధాదన్న గారి విఠల్ రావు , నగర మేయర్ ధండు నీతు కిరణ్ ,  రాష్ట్ర మార్కెట్ చైర్మన్ మార గంగారెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి , డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్  పాలక వర్గ సభ్యులు, సొసైటీ చైర్మన్ లు పాల్గొన్నారు


No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...