హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తాను కోరుకున్నవాడు ప్రత్యూష జీవితంలోకి రాబోతున్నాడు. హైదరాబాద్ విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో రాంనగర్ ప్రాంతానికి చెందిన చరణ్ రెడ్డితో నిరాడాంబరంగా ప్రత్యూష నిశ్చితార్థ వేదిక జరిగింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రత్యూష నిశ్చితార్థ వేడుకను మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య పర్యవేక్షించారు.2017లో కన్నతండ్రి, పినతల్లి వేధింపులతో చావు బ్రతుకుల మధ్య ప్రత్యూష ఆస్పత్రిలో చేరింది. అమ్మాయి గోడు విని చలించిన సీఎం కేసీఆర్.. అప్పట్లో హాస్పిటల్‌కు వెళ్లి పరామర్శించారు. తరువాత ఆమెను తన దత్త పుత్రికగా ప్రకటించారు. సంరక్షణ బాధ్యతలను ఐఏస్ అధికారి రఘునందన్ రావుకు అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యూష యోగ క్షేమాలను చూస్తోంది. ఐదేళ్లలో ఆరోగ్యపరంగా, విద్యాపరంగా ఎదిగిన ప్రత్యూష నర్సింగ్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తోంది. మమత, మర్రెడ్డి దంపతుల కుమారుడు చరణ్ రెడ్డి ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్.. ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రత్యూషను సంప్రదించగా ఆమె అంగీకరించింది. ఈ విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. వారు ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్.. ప్రత్యూషను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఆమె పెళ్లి చేసుకోబోయే యువకుడి వివరాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్.. సంతోషం వ్యక్తం చేశారు. ప్రత్యూష నిశ్చితార్థానికి వెళ్లాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యను సీఎం ఆదేశించారు. దీంతో కమిషనర్.. ప్రత్యూష నిశ్చితార్థ వేడుకను పర్యవేక్షించారు. ఇదిలాఉండగా, సీఎం కేసీఆర్ అండతోనే కోలుకున్నానని, తన వివాహానికి వస్తానని కేసీఆర్ తనతో చెప్పినట్లు ప్రత్యూష వెల్లడించింది. మంచి కుటుంబంలోకి వెళ్తున్నందుకు తనకు ఆనందంగా ఉందని ప్రత్యూష సంతోషం వ్యక్తం చేసింది.
Subscribe to:
Post Comments (Atom)
ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...

-
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...
-
నిజామాబాద్, జనవరి 03 ( ప్రజా జాగృతి విలేఖరి) : ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ ...
-
బీఆర్ ఎస్ కు మునిసిపల్ ఛాంబర్ సంపూర్ణ మద్దతు చౌటుప్పల్, ప్రజాజాగృతి, డిసెంబర్ 12 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : తెలంగాణ జాతిపిత కెసిఆర్ ఏర్పా...
No comments:
Post a Comment