Friday, September 16, 2022

సెప్టెంబర్ 17 సమైక్యత కాదు విమోచనం - బిజేపి సీనియర్ నాయకులు మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రావు

 


తెలంగాణ రాష్ట్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా విమోచన దినోత్సవం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడ సిగ్గుచేటు అని బిజేపి సీనియర్ నాయకులు మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రావు అన్నారు. నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన కొండ విశ్వేశ్వరావు జిల్లా కేంద్రంలోని నిజాం నవాబ్ పాలనను ఎదిరించినందుకు గాను జైలు పాలైన దాశరతి కృష్టమాచార్యుడు వున్న ఖిల్లా జైల్ ను సందర్శించిన కొండ అక్కడ దాశరతి చిత్రపటానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం బిజేపి పార్టీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేళంలో ఆయన మాట్లాడుతూ  నిజాం నిరంకుష పాలనను నుండి విముక్తి పొందిన సెప్టెంబర్ 17 ను తెలంగాణ మిమేచన దినోత్సవాన్ని జరుపుతామని   కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి అధికారికంగా జరుపేందుకు నిర్ణయం తీసుకుందని అన్నారు. సెప్టెంబర్ 17  సమైక్యత కాదు విమోచనం అని ఎంఐఎం కు బయపడే కేసిఆర్ సర్కార్ సమైఖ్యతా రాగం ఎంచుకుందని మండిపడ్డారు. 8 ఏళ్ల కేసీఆర్ పాలన మళ్ళీ నిజాం పాలనను తలపిస్తోందని అన్నారు.

No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...