Tuesday, September 13, 2022

తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక అసెంబ్లీ ముట్టడికి యత్నం || ముందస్తు అరెస్టు

 


తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈనెల 13న అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడంతో తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ అసెంబ్లీ ముట్టడికి నిర్ణయం తీసుకోవడంతో అధ్యక్షులువిజయ్ పాల్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి లక్కం మనోజ్ రెడ్డి,ఉపాధ్యక్షులు నాగిరెడ్డి లను తెల్లవారుజామున మూడు గంటలకి ఫోర్త్ టౌన్ పోలీస్ పోలీసులు ముందస్తు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు సంయుక్తంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మూడు సంవత్సరాలు గడిచిన ఇంతవరకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని అందుకోసం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు అనగా 13వ తారీఖున అసెంబ్లీ ముట్టడి కొరకు వెళ్తుంటే తెల్లవారుజామున మూడు గంటలకి ఇంటి వద్ద వచ్చి అరెస్టు చేయడం సిగ్గుచేటు అని అన్నారు. ఈ అరెస్టుల వల్ల రెడ్డి ఐక్యవేదిక ఉద్యమాలను ఆపలేనన్నారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు జరిగే అసెంబ్లీ లో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నామనిప్రకటించాలని అన్నారు.లేకుంటేవచ్చే ఎన్నికల్లోతగిన గుణపాఠంచూపిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు విజయపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్కం మనోజ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. pls. subscribe and share ... pls suporte over channel praja jagruthi tv comming soon 24 hours news and entertainment live channel ... pls

No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...