Wednesday, September 21, 2022

కలెక్టరేట్లో జర్నలిస్టుల కోసం గదిని కేటాయించండి - కలెక్టర్ కు టిడబ్ల్యూజేఎఫ్ వినతి


 కలెక్టరేట్లో జర్నలిస్టుల కోసం గదిని కేటాయించండి - కలెక్టర్ కు టిడబ్ల్యూజేఎఫ్ వినతి


నిజామాబాద్ నూతన జిల్లా సమీకృత కార్యాలయంలో జర్నలిస్టుల కోసం వసతులతో కూడిన గదిని కేటాయించాలని బుధవారం టి డబ్ల్యూజె ఎఫ్ నాయకులు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం కొత్త కలెక్టరేట్లో జర్నలిస్టులకు గది లేకపోవడంతో వార్తలు కవరేజ్ చేసిన జర్నలిస్టు చెట్ల కింద, కార్యాలయం ముందున్న బెంచీల మీద కూర్చోవాల్సి వస్తుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు‌. సమీకృత కార్యాలయంలో అన్ని కార్యాలయాలు  వచ్చిన నేపథ్యంలో జర్నలిస్టులందరూ కొత్త కలెక్టర్ కేంద్రంగా పనులు చేస్తున్నారని తెలిపారు. వార్తలు రిపోర్ట్ చేసేందుకు వీలుగా ఇంటర్నెట్ తో కూడిన కంప్యూటర్, ఒక టీవీని ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే జర్నలిస్టుల అక్రిడేషన్ కమిటీ రెండో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఫెడరేషన్ నాయకుల విజ్ఞప్తిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. సమీకృత కార్యాలయంలో జర్నలిస్టులకు గదిని కేటాయించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. అలాగే అక్రిడేషన్ కమిటీ రెండో సమావేశం వచ్చేవారం నిర్వహిస్తామని తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో టీ డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా కార్యదర్శి రామచందర్ రెడ్డి, అధ్యక్షులు భాస్కర్, ఇండియన్ ఫెడరేషన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నేషనల్ కౌన్సిల్ మెంబర్  కుంచం శ్రీనివాస్,ఫెడరేషన్ స్టేట్ కౌన్సిల్ మెంబర్   కుంచం వెంకటేష్,పరమేష్,కోరి  రాకేష్ తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...