జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ డిమాండ్ చేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల డిమాండ్స్ డే లో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిప్రతం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె వెంకటేష్, జిల్లా కార్యదర్శి రాంచందర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మీడియాలో పని చేస్తున్న జర్నలిస్టులు పేదరికంలో సొంత ఇళ్ళు లేక అద్దె ఇళ్ళల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కావున సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లో పని చేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు ఇవ్వాలని, ఆర్ ఎన్ ఐ ఉన్న ప్రతి పత్రికకు చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ అక్రిడేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే అడ్వర్టైజ్మెంట్ పెంచాలని కోరారు. జర్నలిస్టులకు రైల్వే రాయితీ పాస్ లు పునరుద్ధరించి, బస్ పాస్, రైల్వే పాస్ లపై 100 శాతం రాయితీ కల్పించాలని కోరారు . జర్నలిస్టుల కుటుంబా సభ్యులకు సైతం బస్‌పాస్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు టోల్ గేట్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని, రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు 5000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జర్నలిస్టులకు ''జర్నలిస్టుబంధు'' పథకం ప్రవేశ పెట్టాలని కోరారు. ఈ కార్య్రకమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు అనిత, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు కోరి రాకేష్, జిల్లా నాయకులు నరేష్, సురేష్, సందీప్ దేశ్ ముఖ్, మధు, కృష్ణ, జాదవ్ శరత్, ప్రవీణ్, ప్రమోద్, శ్రీకాంత్ గౌడ్, శివ ఠాకూర్, శ్రీకాంత్, బొర్రన్న, అశోక్, రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...

-
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...
-
నిజామాబాద్, జనవరి 03 ( ప్రజా జాగృతి విలేఖరి) : ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ ...
-
బీఆర్ ఎస్ కు మునిసిపల్ ఛాంబర్ సంపూర్ణ మద్దతు చౌటుప్పల్, ప్రజాజాగృతి, డిసెంబర్ 12 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : తెలంగాణ జాతిపిత కెసిఆర్ ఏర్పా...
No comments:
Post a Comment