చౌటుప్పల్, ప్రజా జాగృతి, నవంబర్ 25 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : చౌటుప్పల్ లోని దేశబోయిన సత్తెమ్మ నీ తన మనవళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రాణ రక్షణ కల్పించమని కలెక్టర్ కి సమర్పించిన ఫిర్యాదులో భాగంగా జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆదేశాలతో సంబంధిత ఎఫ్ఆర్ఓ తిరుపతి రెడ్డి, సూపర్వైజర్ శోభ,అంగన్వాడి టీచర్ లు కలిసి విచారణ చేపట్టారు.విచారణలో దేశబోయిన సత్తెమ్మ కు సంబంధించిన ఆస్తి తగాదా వల్ల తన మనవళ్లు మద్యం సేవించినప్పుడు మాత్రమే అమ్మమ్మని దూషించారని, అది తప్పేనని ఒప్పుకున్నారు అని తెలిపారు.సందీప్,సాయికుమార్లు ఇద్దరూ తమ అమ్మమ్మతో కలిసి ఉండడానికి ఒప్పించమని తెలిపారు. వయోవృద్ధుల సహాయక కేంద్రం 14567 కు వచ్చిన తంగడపల్లి గ్రామానికి చెందిన బడేటి సత్తెమ్మ ఫిర్యాదు విచారణను చేపట్టగా, తమ ఇద్దరు కొడుకులు పోషణ ఖర్చులు ఇవ్వడంలేదని, తనకు పోషణ ఖర్చులు ఇప్పించడానికి మమ్మల్ని ఆశ్రయించడం వల్ల విచారణ చేపట్టడం జరిగిందని అన్నారు. విచారణలో తమకు సంవత్సరానికి కాకుండా ప్రతినెల 12 వేల రూపాయలు తమ భర్త బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది అని తమ ఇద్దరు కొడుకులు తెల్పడం జరిగింది, అది నిజమేనని వృద్ద దంపతులు ఒప్పుకున్నారు. తమ కొడుకులను తల్లితండ్రుల ఆరోగ్యాన్ని పట్టించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పడంతో వారి కుమారులు అంగీకరించారు. ఇందులో భాగంగా వారి కుమారులకి ఎఫ్ ఆర్ ఓ, సూపర్వైజర్ లు వయోవృద్ధుల చట్టం గురించి వివరించి బడేటి సత్తమ్మ ను భర్త స్వామిని నేటి నుంచి ఆరోగ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు పట్టించుకోవాలని వారి బాధ్యత తమదేనని ఇద్దరు పిల్లల్నికు వివరించారు.
Subscribe to:
Post Comments (Atom)
ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...

-
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...
-
నిజామాబాద్, జనవరి 03 ( ప్రజా జాగృతి విలేఖరి) : ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ ...
-
బీఆర్ ఎస్ కు మునిసిపల్ ఛాంబర్ సంపూర్ణ మద్దతు చౌటుప్పల్, ప్రజాజాగృతి, డిసెంబర్ 12 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : తెలంగాణ జాతిపిత కెసిఆర్ ఏర్పా...
No comments:
Post a Comment