Saturday, November 26, 2022
కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని సహాయం చేసిన దివ్యసు ఉద్యోగులు
చౌటుప్పల్, ప్రజాజాగృతి, నవంబర్ 26 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) :- సొంతవారికి సహాయం అందించని ఈరోజుల్లో కుటుంబాన్ని పోషించే ఇంటి పెద్ద కాళ్లు కోల్పోయి కుటుంబ పోషణ కష్టంగా ఉందన్న విషయం తెలుసుకొని దివిస్ ఉద్యోగులు ఆ కుటుంబానికి 50 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు, కొంత నగదును అందజేశారు. వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ లోని తంగడపల్లి గ్రామానికి చెందిన పోలోజు బ్రహ్మచారి గత సంవత్సరం అనారోగ్యం కారణంగా కాలుని కోల్పోయారు. అందువలన ఆ కుటుంబం కష్టాలలో కూరుకుపోయింది. ఈ విషయం తెలుసుకున్న దివిసుద్యోగి నాగేశ్వరరావు తన సహ ఉద్యోగులుతో కలిసి ఆ కుటుంబానికి కొన్ని రోజులకు సరిపడా నిత్యవసర సరుకులు ఆరో వార్డు కౌన్సిలర్ అలే నాగరాజు చేతుల మీదగా అందజేశారు. కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని సహాయం చేసిన దివ్యసు ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జె. రామకృష్ణ, నెల్లి కృష్ణం నా, ఆర్. భాస్కరరావు, బి. గోపి, దుర్గారావు, కే. రమేష్, ఆర్. భుజంగరావు, సుకంటి బాలిరెడ్డి, శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...

-
నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...
-
నిజామాబాద్, జనవరి 03 ( ప్రజా జాగృతి విలేఖరి) : ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ ...
-
బీఆర్ ఎస్ కు మునిసిపల్ ఛాంబర్ సంపూర్ణ మద్దతు చౌటుప్పల్, ప్రజాజాగృతి, డిసెంబర్ 12 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : తెలంగాణ జాతిపిత కెసిఆర్ ఏర్పా...
No comments:
Post a Comment