ప్రెస్ క్లబ్ ను కూల్చే ప్రసక్తి లేదని జర్నలిస్టులకు హామీ
నిజామాబాద్, ప్రజా జాగృతి, డిసెంబర్ 12 (కుంచం శ్రీనివాస్) : నిజామాబాద్ నగర అభివృద్ది,సుందరికీకరణలో భాగంగా శిథిలావస్థకు చేరిన,పురాతన ప్రభుత్వ కార్యాలయాల భవనాల కూల్చివేత జరుగుతున్న నేపధ్యంలో నిజామాబాద్ ప్రెస్‌క్లబ్ భవన్నాని కూడా కూల్చివేసే ప్రతిపాదన ఉన్నట్టు మన దృష్టికి రావడంతో,నిజామాబాద్ ప్రెస్‌క్లబ్ కూల్చివేసే ప్రతిపాదన లేదని,జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హామీ ఇచ్చినట్లు,జర్నలిస్టు సోదరులంతా ఎలాంటి అపోహలకు,అనుమానాలకు తావివ్వద్దని ప్రెస్ క్లబ్ కమిటీ ప్రధాన కార్యదర్శి రాజలింగం స్పష్టం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,ఒక వేళ ప్రెస్ క్లబ్ కూల్చివేయాల్సిన పరిస్థితులేమైనా ఏర్పడితే,రోడ్డుకు ఆనుకొని ఉన్న ద్వాక్రా బజారు వైపు ప్రెస్ క్లబ్ కు అనుకూలమైన భవనాన్ని ఏర్పాటు చేసిన అనంతరం,పాత కూల్చివేత అనే ప్రస్తావన ఉంటుందని కలెక్టర్ తెలిపినట్లు రాజలింగం పేర్కొన్నారు.ఇదే అంశానికి సంబంధించి తదితర యూనియన్ల కమిటీలు కూడా కలిశాయని వారికి ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు.ఇట్టి కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ కమిటీ పిలుపు మేరకు విచ్చేసిన క్లబ్ సభ్యులందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు సంగీత,ఈసీ సభ్యులు,ప్రమోద్ గౌడ్,జెట్టి గోవింద్ రాజ్,సిరిగాద ప్రసాద్,రాంచందర్ రెడ్డి,శ్రీధర్, సందీప్ దేశ్ముఖ్, నరేంద్ర స్వామి, క్లబ్ సభ్యులు,బొబ్బిలి నర్సయ్య,పాకాల నర్సింలు,జావిద్,కుంచం శ్రీనివాస్ ఈశ్వర్,సుదర్శన్,దశరథ్,శ్రీధర్,చంద్రమోహన్,రాజు, ఆంధ్రభూమి రవి, పల్నాటి రఘు,కృష్ణ,డాక్టర్ శీను,మల్లెపూల నరసయ్య,తీస్మార్ ఖాన్ శివన్న, శ్రీనివాస్,నర్సింలు వెంకటేశం, రాజు, శ్రీకాంత్ గౌడ్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment