Monday, December 12, 2022

ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి- అఖిలపక్ష



 ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం నేడు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రం జిల్లా కలెక్టర్ గారికి అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు కలెక్టర్ గారికి వివరిస్తూ నిజామాబాద్ పాత కలెక్టరేట్ ప్రాంగణం, కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, ఎండిఓ కార్యాలయం, ఆర్ అండ్ బి క్వార్టర్స్, ఇరిగేషన్ ఆఫీస్ క్యాంపస్,ఆర్డిఓ, ఎం ఆర్ ఓ పాత భవనాలన్నీ కూల్చివేస్తున్నారని ఇట్టి స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులకు లీజులకు ఇవ్వకుండా ప్రభుత్వ ఆధీనంలో ఉంచాలని ప్రజలకు, క్రీడాకారులకు అవసరమగు నిర్మాణాలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకై తమరి ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించాలని మరియు శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు.

జిల్లా కలెక్టర్ గారు అఖిలపక్ష పార్టీల నాయకులతో మాట్లాడుతూ పాత కలెక్టరేట్ సమీకృత భవనాలు, ప్రస్తుతం కూల్చుతున్న తదితర భవనాల స్థలాలలో ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు, క్రీడా ప్రాంగణం, కళాభవన్ తో పాటు ప్రజలకు అవసరమగు సుందరవనాన్ని నిర్మిస్తామని, ఏ ప్రైవేటు వ్యక్తులకు లీసులకు ఇవ్వబోమనితెలిపారు ఈ కార్యక్రమంలో ఒలంపిక్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నరసయ్య, సిపిఐ పి.సుధాకర్, సిపిఎం రమేష్ బాబు,సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా వీ.కృష్ణ, బిఎల్ఎఫ్ దండి వెంకట్,ఏఐఎఫ్బి రాజుగౌడ్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జేల్లా మురళి, వరదయ్య, దొడ్డు గంగాధర్, ఎంసిపిఐ కర్రె శ్రీనివాస్, బిఎస్పి.పీట్ల శ్రీనివాస్, మరియు నాయకులు ఓమయ్య,రాజన్న, సూరి,సుధాకర్,రాజశేఖర్, రంజిత్ , శివప్ప తదితర నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...