నిజామాబాద్, జనవరి 03 ( ప్రజా జాగృతి విలేఖరి) : ప్రజా జాగృతి తెలుగు దినపత్రిక మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యలు, నిజామాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రజా జాగృతి దినపత్రిక 2023 క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ధన్‌పాల్ సూర్యనారాయణ ను పత్రిక సంపాదకులు కుంచం శ్రీనివాస్ పుష్పగచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం సూర్యనారాయణ మాట్లాడుతూ ప్రజా జాగృతి క్యాలెండర్ ఆవిష్కరణ చాలా సంతోషంగా ఉందన్నారు. పత్రికా సంపాదకులు కుంచం శ్రీనివాస్ గత 25 ఎళ్ల నుంచి పత్రిక రంగంలో ( జర్నలిజం వృత్తిలో) ఉన్నారని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇండియన్ పేఢరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ గా కొనసాగుతున్నారని ధన్‌పాల్ గుర్తు చేశారు. కుంచం శ్రీనివాస్ తనకు చాలా సుపరిచితుడని తను ఈ స్థాయిలో ఉండడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే గత 12 సంవత్సరాలు ఎన్నో వ్యయప్రయాసలకు తట్టుకుని 13 వ సంవత్సరలోకి అడుగుపెట్టినందకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పత్రిక సంపాదకులతో పాటు సిబ్బందికి కూడా శుభాకాక్షలు తెలియజేశారు.అనంతరం పత్రిక ఎడిటర్ కుంచం శ్రీనివాస్, ధన్‌పాల్ సూర్యనారాయణ కు అభినంధనలు తెలియజేశారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రజా జాగృతి బ్యూరో క్యాతం నాగారాజు, జర్నలిస్టులు ద్యావర నర్సారెడ్డి, ఖన్నా తదితరకులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment