Wednesday, January 4, 2023

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి

చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎదురుకొంటున్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తూ ప్రజలను జాగృతం చేస్తుంది ప్రజజాగృతి అని చౌటుప్పల్ సీఐ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో మంగళవారం ప్రజా జాగృతి ఆధ్వర్యంలో ప్రచురించిన నూతన క్యాలెండరు ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజజాగృతి కృషి చేస్తుందని కొనియాడారు. నూతన సంవత్సరం సందర్బంగా విద్యార్థులు, యువత మద్యం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, మంచి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని వాటిని సాధించే విధంగా కృషి చేయాలన్నారు. ప్రజలు అనవసరమైన తగాదలు పెట్టుకోవద్దని, ఏదయినా సమస్య ఎదురైతే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీసులు అంటే భయం వద్దని తెలంగాణ లో ఫ్రెండ్లీ పోలీస్ లు అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ఏఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ యాదగిరి రెడ్డి, కానిస్టేబుల్ నరేష్ కుమార్, వరికుప్పల తోనేశ్వర్ నంద, కొలుకులపల్లి రాజశేఖర్, అన్నమొని నాగేంద్ర, సీకిలమెట్ల శశికాంత్, సీకిలమెట్ల నరేశ్, చికురి యాదయ్య పాల్గొన్నారు.

No comments:

Post a Comment

ప్రజలను జాగృతం చేస్తున్న ప్రజాజాగృతి

 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆవిష్కరించిన్న సీఐ మల్లికార్జున్ రెడ్డి చౌటుప్పల్, ప్రజా జాగృతి, జనవరి 3 ( వరికుప్పల తోనేశ్వర్ నంద ) : ప్రజలు ఎద...