ఇక ఇటీవల రేణు దేశాయ్ బుల్లితెరపై అడపాదడపా కనిపిస్తున్నారు. ఇక టాలీవుడ్ లో తన రీఎంట్రీ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. దాదాపు 17 సంవత్సరాల విరామం తరువాత.. రేణు దేశాయ్ తన రెండవ ఇన్నింగ్స్ కోసం సన్నద్ధమవుతున్నారు. రేణు దేశాయ్ `ఆధ్యా` అనే చిత్రానికి సంతకం చేసారు.
‘ఆధ్యా’ లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇందుల రేణు దేశాయ్ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో నందిని రాయ్ .. కబాలి ఫేమ్ సాయి ధన్సికతో పాటు బాలీవుడ్ నటుడు వైభవ్ తత్వావాడీ నటించారు. ఎస్ రజనీకాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హుషారు ఫేమ్ తేజ కూరపాటి.. గీతిక రతన్ యువ జంటగా నటించనున్నారు. ఆసక్తికరంగా రేణు కుమార్తె పేరు ఆద్యా. అదే పేరుతో రీఎంట్రీ సినిమాలో నటిస్తుండడం యాథృచ్ఛికమే. రేణు ఇటీవల బ్రీథ్ లెస్ అనే మ్యూజికల్ వీడియోలో కనిపించారు. 2013 లో `వన్స్ మోర్` అనే చిత్రం తో నిర్మాతగా మారి.. 2014 లో ఇష్క్ వాలా లవ్ తో దర్శకురాలిగా మారిన సంగతి తెలిసిందే. గ్యాప్ తర్వాత రేణు తిరిగి నటనలో అడుగుపెడుతున్నారు.