నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్, మార్చి 22:
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం నాడు ఎన్నికల జరిగాయి.ఎన్నికల అధికారి సీనియర్ జర్నలిస్టు ఆకుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగాయి.సోమవారం ప్రకటించిన ఫలితాలు అధ్యక్షులుగా అంతడుపుల రామకృష్ణ,ప్రధాన కార్యదర్శిగా వాగ్మారే సుభాష్, కోశాధికారిగా బుస్స రాజు లతోపాటు, ఉపాధ్యక్షులుగా పిప్పర నరేందర్, గుండాజి శ్రీనివాస్, ఆంజనేయులు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజ్ కుమార్, సంయుక్త కార్యదర్శులుగా రాజలింగం,మహేందర్,బాల్ కుమార్, నరేంద్ర స్వామి లతో పాటు 18 మంది కార్యవర్గ సభ్యులుగా రమణ, భాస్కర్ గౌడ్, కొట్టురి శ్రీనివాస్, రామ్ చందర్ రెడ్డి, రవి చరణ్ రెడ్డి, శ్రీధర్, శేఖర్, ప్రసాద్,శ్రీనివాస్,నర్సయ్య
,లక్కం మనోజ్ రెడ్డి,సుదర్శన్,సురేష్ సాయిలు, శివ భానుతేజ,డి. యల్. ఎన్ చారి కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, సుభాష్ మాట్లాడుతూ... ప్రెస్ క్లబ్ అభివృద్ధికి జర్నలిస్టుల సంక్షేమానికి,సీనియర్ల సహకారం, సలహాలు, సూచనలు తీసుకుని ముందుకు సాగుతున్నారు.అందరి సహకారంతో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి కృషి చేశారన్నారు.ప్రతి సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు.2021 -2022 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గ కార్యవర్గాన్ని పరుగులు జర్నలిస్టులు ఆ అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల సహాయకులుగా అశోక్. బాలరాజు తదితరులు పాల్గొన్నారు.